Monday, November 21, 2011

కాదేది కవతకనర్హ్యం

మైదానపు క్రీడా, మేధో క్రీడా, రాసః క్రీడా -
హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!
డేటా స్ట్రక్చర్స్, మేథమెటికల్ స్ట్రక్చర్స్, హ్యూమన్ స్ట్రక్చర్స్ -
నీ వేపే చూస్తూ ఉంటాయ్! తమ లోతు కనుక్కోమంటాయ్!

Monday, November 14, 2011

ఓరి మనిషీ

గుడి లోపల దేవుణ్ణి కొలుస్తావ్, గుడి బయట దళితుణ్ణి ఈసడిస్తావ్,
నీకెందుకురా రామాయణ పురాణాలు, గీతాపారాయణాలు!

ఎంకన్నకి పసిడి మొక్కులిస్తావ్, పాలేరుకి ఎంగిలి ఆకులిస్తావ్,

నీకెందుకురా ఆధ్యాత్మిక చింతనలు, ఆదర్శపు బోధనలు!
 

మట్టి బొమ్మకి పాలు పోస్తావ్, మేక పోతుని పీక కోస్తావ్, 
నీకెందుకురా నీతి నేర్పని సూత్రాలు, విలువ నేర్పని వేదమంత్రాలు!
 

ఆడపిల్ల అని ప్రాణం తీస్తావ్, మగ పిల్లగాన్ని నెత్తిన మోస్తావ్,
మరి నీ అమ్మని కూడా అలా చేసుండుంటే, నీ పుట్టుకేదిరా!
 

రేటుందని కనక పూజ చేస్తావ్, కూడిచ్చిన రైతు అంతు చూస్తావ్, 
నీకెందుకురా వ్యాపార మార్కెట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు!
 

ఆకలంటే ఆర్ధిక మాంద్యం అంటావ్, ఆటవిక న్యాయం అంటావ్, 
నీకెందుకురా అర్థం కాని అర్థశాస్త్రాలు, అవసరం లేని అస్త్ర శస్త్రాలు!
 

రైతుకు రుణ మాఫీ అన్నావ్, మిల్లర్ దగ్గర మరి నా ఫీ అన్నావ్,
నీకెందుకురా ప్రభుత్వ పదవులు, మంత్రిత్వపు విధులు!
 

ప్రేమే దైవం సేవే మార్గం అన్నావ్, మహాసముద్రంలో కలసిపోయావ్, 
నీకెందుకురా సామాజిక న్యాయాలు, పవిత్ర రాజకీయాలు!
 

కాలుష్య నివారణ అన్నావ్, మరి దీపావళికి టపాకా సంబరాలన్నావ్,
నీకెందుకురా పర్యావరణ పురాణాలు, భౌగోళిక ధార్మిక స్థితిగతులు!
 
పీహెచ్డీ రిసెర్చ్ అన్నావ్, లోక్పాల్ ఏమిటని అడిగితే అదేమిటి అన్నావ్,

నీకెందుకురా విజ్ఞానం లేని పరిజ్ఞానాలు, గీతం యూనివర్సిటీలు!