మైదానపు క్రీడా, మేధో క్రీడా, రాసః క్రీడా -
హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!
డేటా స్ట్రక్చర్స్, మేథమెటికల్ స్ట్రక్చర్స్, హ్యూమన్ స్ట్రక్చర్స్ -
నీ వేపే చూస్తూ ఉంటాయ్! తమ లోతు కనుక్కోమంటాయ్!
నేనొక మానవ జీవి, నా లోకం భూలోకం, గడిపే ప్రతి క్షణం ఓ జ్ఞాపకం, వేసే ప్రతి అడుగు ఓ గమకం, నడిచే ప్రతి మార్గం ఓ గమ్యం... ఎద కోరిన వనికి పోయి మది పెట్టవోయి, అని నా అభిప్రాయం... సప్తసాగరమదనమైతేనేమి స్వీయశోధనమనుగడైతేనేమి, ప్రతి మనిషి జీవితం విరచించుటకై వేచియున్న కవనం కాదా! సుధీర్గ జీవితంలో మధురానుభూతులని అక్షరరూపంలో మలచడానికి చేసే ప్రయత్నంలో, తెనాలి యామ కవితలకు ప్రభావితుడనై, ఆమె ప్రోత్సాహంతో, వచ్చీరాని గ్రాంధిక తెలుగులో అరకొర వ్రాయడం మొదలుపెట్టాను... వ్రాసిన వాటిలో కొన్నింటిని ఇక్కడ ఉంచుతున్నాను...