Monday, November 21, 2011

కాదేది కవతకనర్హ్యం

మైదానపు క్రీడా, మేధో క్రీడా, రాసః క్రీడా -
హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!
డేటా స్ట్రక్చర్స్, మేథమెటికల్ స్ట్రక్చర్స్, హ్యూమన్ స్ట్రక్చర్స్ -
నీ వేపే చూస్తూ ఉంటాయ్! తమ లోతు కనుక్కోమంటాయ్!

Monday, November 14, 2011

ఓరి మనిషీ

గుడి లోపల దేవుణ్ణి కొలుస్తావ్, గుడి బయట దళితుణ్ణి ఈసడిస్తావ్,
నీకెందుకురా రామాయణ పురాణాలు, గీతాపారాయణాలు!

ఎంకన్నకి పసిడి మొక్కులిస్తావ్, పాలేరుకి ఎంగిలి ఆకులిస్తావ్,

నీకెందుకురా ఆధ్యాత్మిక చింతనలు, ఆదర్శపు బోధనలు!
 

మట్టి బొమ్మకి పాలు పోస్తావ్, మేక పోతుని పీక కోస్తావ్, 
నీకెందుకురా నీతి నేర్పని సూత్రాలు, విలువ నేర్పని వేదమంత్రాలు!
 

ఆడపిల్ల అని ప్రాణం తీస్తావ్, మగ పిల్లగాన్ని నెత్తిన మోస్తావ్,
మరి నీ అమ్మని కూడా అలా చేసుండుంటే, నీ పుట్టుకేదిరా!
 

రేటుందని కనక పూజ చేస్తావ్, కూడిచ్చిన రైతు అంతు చూస్తావ్, 
నీకెందుకురా వ్యాపార మార్కెట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు!
 

ఆకలంటే ఆర్ధిక మాంద్యం అంటావ్, ఆటవిక న్యాయం అంటావ్, 
నీకెందుకురా అర్థం కాని అర్థశాస్త్రాలు, అవసరం లేని అస్త్ర శస్త్రాలు!
 

రైతుకు రుణ మాఫీ అన్నావ్, మిల్లర్ దగ్గర మరి నా ఫీ అన్నావ్,
నీకెందుకురా ప్రభుత్వ పదవులు, మంత్రిత్వపు విధులు!
 

ప్రేమే దైవం సేవే మార్గం అన్నావ్, మహాసముద్రంలో కలసిపోయావ్, 
నీకెందుకురా సామాజిక న్యాయాలు, పవిత్ర రాజకీయాలు!
 

కాలుష్య నివారణ అన్నావ్, మరి దీపావళికి టపాకా సంబరాలన్నావ్,
నీకెందుకురా పర్యావరణ పురాణాలు, భౌగోళిక ధార్మిక స్థితిగతులు!
 
పీహెచ్డీ రిసెర్చ్ అన్నావ్, లోక్పాల్ ఏమిటని అడిగితే అదేమిటి అన్నావ్,

నీకెందుకురా విజ్ఞానం లేని పరిజ్ఞానాలు, గీతం యూనివర్సిటీలు!

Monday, October 31, 2011

చేసేది పట్టణవాసం - మేసేది పల్లెలగ్రాసం

చేసేది పట్టణవాసమైనా, మేసేది పల్లెలగ్రాసమే...
నివసించేది పాలరాతి గృహాలైనా, నిలుచునేది పుడమితల్లి రొమ్ములపైనే...
దేహానికి పూసేది విలేపనాలైనా, మనుగడకి పీల్చేది ప్రాణవాయువులే...
నిర్మించుకునేది నవనాగరిక సమాజమైనా, నిర్మించేది యువసైనిక చైతన్యమే...

Friday, January 15, 2010

జనగళమున సడి నానక మునుపే

జనగళమున సడి నానక మునుపే
భారత ప్రభుత్వపు దూత,
తెలంగాణ సీమ సర్కారు ఆంధ్ర
వీడెను ముక్కల బాట
విద్య ఆరోగ్యం ఉపాధి పరంగా
ప్రాంత అసమానత చూడంగ
తన సుభమునకై జాగోరే
మన సుభమునకై ఆఓరే
గారే మన జయ గానా
జనగళమున సడి నానక మునుపే
భారత ప్రభుత్వపు దూత,
రావే, రావే, రావే,
జనగళమును జర వినవే...

(అనాలోచనగా ఒకేసారి "జన గణ మన" గేయం మరియు తెలంగాణ అంశం మదిలో మెదలాడాయి... "జన గణ మన అధినాయక జయహే" వ్యాక్యాన్ని తెలంగాణ అంశంతో ముడిపెట్టి, 'జన గళమున అది(తెలంగాణ) నానక మునుపే' ఈ రాష్ట్రాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే బావుంటుంది కదా అనే ఆలోచన తట్టి, ఈ పేరడి గేయం పుట్టింది...)

Tuesday, January 5, 2010

ప్రకృతి కాంత ప్రసాదం

జీవకోటికి ప్రకృతి కాంత ప్రసాదమే మన భవితం...
ప్రజాస్వామ్యపు పురిటినొప్పులకి పోరాటం కాదు పరిష్కారం...
సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగిన మెధస్సుకీ ఆలోచనే మార్గం...
ఈ నిజం తెలుసుకోలేని మానవాళికి మనుగడ ఇక క్షణికం...

(తెలంగాణ సమస్య పై సంభాషిస్తూ, "ప్రకృతి పురిటి నొప్పుల నుంచె కొత్త శృష్టి వస్తుంది!" అనే శ్రీ శ్రీ వ్యాక్య నుండి పురుడు పోసుకున్న ముక్క)

Friday, July 24, 2009

మబ్బులకే మతి ఉంటే

మబ్బులకే మతి ఉంటే అవి గాలివాటు గమనానికి కాక జీవకోటి మనుగడకై తరలిపోవా...
బస్సులకే రెక్కలు వస్తే అవి రోడ్డు వీడి నింగికెగసి దివిని కలసి తిరిగి భువిని చేరుకోవా...

(మిట్టమద్యాహ్నం కారుమబ్బులు ఉరుములు మెరుపులతో లైప్జిగ్ లో కుండపోతగా కురుస్తున్న జోరువానను చూస్తూ, వర్షమో రామచంద్రా అని మొర పెట్టుకుంటున్న భారత రైతాంగాన్ని తలచుకుంటూ, అదే సమయంలో మరెక్కడో మరెవరో జనారణ్యంలో రద్దీగా ఉండే సిటీబస్సు ప్రయాణావస్తను ఊహించుకుంటూ వ్రాసిన ముక్క...)

Friday, June 19, 2009

చిత్రమైన భావనలు

భావస్వారూప్యత బహు నిండుగా ఉన్న మీ కవితలు చదివేకొద్దీ నాలో చిత్రమైన భావనలు కలుగుతున్నాయి...
చదవడానికి ఉపక్రమించే ముందు, ఆడుకోవటానికి అనుమతి పొందిన పసిమనసువలె, నా మది ఉప్పొంగుతుంది...
చదువుతున్నంతసేపు, ఆ పదకవితాకాసాన్న పయనిస్తున్న స్వేచ్చావిహంగంవలె, నా దేహం విహరిస్తుంది...
చదవటం ముగిసిన వేళ, అంతిమాధ్యాయానికి చేరువోతున్న ముదసలి అసువువలె, నా ఎద ఆరాటపడుతుంది...

(యామిని గారి కవితలకి ప్రభావితమై వ్రాసిన మలి కవిత)